డిగ్రీ విద్యార్థులకు అలర్ట్‌.. పరీక్షలు వాయిదా

-

రేపు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. బీఏ, బీబీఏ, బీసీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఒకేషనల్ మూడో సెమిస్టర్ పాటు బీహెచ్ఎం, సీటీ మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 8న నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

ఇదిలా ఉండా.. ఇటీవల ప్రారంభమైన డిగ్రీ పరీక్షలకు పరీక్షా కేంద్రాలన్ని యూనివర్సిటీ అధికారులు మార్చారు. దీంతో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సౌకర్యాల కొరకు కృషి చేస్తుంటే.. ఉన్న కేంద్రాన్ని మార్చి దూర ప్రాంతానికి తరలించడం ఏంటని ప్రశ్నించారు. ఇలా పరీక్షా కేంద్రం దూరం ఉండటం వల్ల విద్యార్థులకు దూర భారం పెరిగిపోతుందని.. దీంతో పరీక్షలకు హాజర కావడం కష్టంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 12న ఈ మేరకు తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలను మార్చొద్దని విన్నవించారు. బైంసా పట్టణ ఎగ్జామ్స్ కేంద్రానికి సుమారుగా 25 కిలోమీటర్ల పరిధిలో గ్రామాలు, పల్లెలులో చదువుకుంటున్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version