దక్షిణ తెలంగాణపై కేసీఆర్ కు సవతి తల్లి ప్రేమ అని విమర్శులు చేశారు వైఎస్ షర్మిల. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేంత వరకు మేం పోరాడుతూనే ఉంటాం. అవసరమైతే 24గంటల నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. మాట మీద నిలబడే నాయకత్వం కోసం, వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే YSR తెలంగాణ పార్టీ పెట్టామన్నారు.
అధికారంలోకి వచ్చిన రోజున అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ప్రజల మేలు కోసం చేపట్టిందే ప్రజాప్రస్థానం. ఈ ప్రయాణంలో ప్రజల సమస్యలు గుర్తిస్తాం, భరోసా కల్పిస్తాం.వాటికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం.YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుస్తామన్నారు.
వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని ప్రకటించారు వైఎస్ షర్మిల. కల్వకుర్తి ఎమ్మెల్యే చూడడానికి అమాయకుడు కానీ కనపడకుండా వందల కోట్లు వెనకేసిండు. పేనుకు పెత్తనమిస్తే.. నెత్తంతా కొరిగినట్లు.. అధికారం చేతికిస్తే ఒక్క మంచి పని చేయలె. ల్యాండ్ సెటిల్ మెంట్లు చేతనైంది కానీ.. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.