పద్మ దేవేందర్ రెడ్డిపై వైఎస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పద్మా దేవేందర్ రెడ్డి పేరుకే MLAనట. పెత్తనం మాత్రం ఆమె భర్తదేనట అంటూ చురకలు అంటించింది. అన్ని పనుల్లో కమీషన్లట. ఆయనకు కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లే చేతులెత్తేస్తున్నారట. కోనాపూర్ సొసైటీలో నిధులు స్వాహా చేసినా, ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదట. భర్తకో న్యాయం, ప్రజలకో న్యాయమా? అని ఫైర్ అయ్యారు.
కోనాపూర్ సొసైటీకి ఎమ్మెల్యే భర్త చైర్మన్ అంట కదా. మొత్తం తినేసాడు అంట కదా.హైకోర్టు సైతం అవినీతి జరిగింది అని చెప్పిందట. అయినా ఎందుకు కేసు నడపలేదు.. ఎందుకు జైల్లో పెట్టలేదు. ఎమ్మెల్యే భర్తకు ఒక న్యాయం.. ప్రజలకు ఒక న్యాయమా !అని నిలదీశారు. ఇది తాలిబన్ రాజ్యం.. మనం ఉంటున్నది ఆఫ్గాన్ లో. వాళ్ళు చెప్పిందే వేదం. ఎక్కడ చూసినా దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం. ఎక్కడ చూసినా మర్డర్లు.. అత్యాచారాలు. చివరికి జర్నలిస్టులను సైతం మాట్లాడనివ్వడం లేదన్నారు వైఎస్ షర్మిల.
పద్మా దేవేందర్ రెడ్డి పేరుకే MLAనట. పెత్తనం మాత్రం ఆమె భర్తదేనట. అన్ని పనుల్లో కమీషన్లట. ఆయనకు కమీషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్టర్లే చేతులెత్తేస్తున్నారట. కోనాపూర్ సొసైటీలో నిధులు స్వాహా చేసినా, ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదట. భర్తకో న్యాయం, ప్రజలకో న్యాయమా?#PrajaPrasthanam #Medak pic.twitter.com/kAM529Th89
— YS Sharmila (@realyssharmila) October 2, 2022