కల్వకుంట్ల కవితపై షర్మిల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ చేశావని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరం. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుందని చురకలు అంటించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు, మహిళలకు 33% సీట్లు ఎందుకు కేటాయించలేదు? అని మండిపడ్డారు.
2014 ఎన్నికల్లో రెండు సీట్లు.. అంటే 11.76%.. ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ? తెలంగాణ తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదు.. ఇప్పుడున్న క్యాబినెట్ లో పట్టుమని ఇద్దరు మంత్రులు. ఇదేనా మహిళలపై మీకున్న మక్కువ? మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో మీ తండ్రి గారికి వచ్చిన అడ్డంకి ఏంటి? అని నిలదీశారు. మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు అని ఆగ్రహించారు షర్మిల.
మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు.
4/4— YS Sharmila (@realyssharmila) March 3, 2023