కొడుకొస్తున్నాడు…జైలుకు ప‌రుగులు తీసిన షారుక్..!

-

డ్ర‌గ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. రెండు సార్లు ఆర్య‌న్ ఖాన్ బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రిపినా ఫలించ‌లేదు. అయితే తాజాగా ఈ రోజు ఆర్య‌న్ ఖాన్ జైలునుండి విడుద‌ల కానున్నారు. గురువారం ఆర్య‌న్ ఖాన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో మ‌రికొద్దిసేప‌ట్లో ఆయ‌న జైలు నుండి విడుద‌ల కానున్నారు. ఈ నేప‌థ్యంలో షారుక్ ఖాన్ త‌న లీగ‌ల్ టీమ్ తో క‌లిసి కార్ల‌లో ఉద‌యాన్నే కొడుకును తీసుకువ‌చ్చేందుకు ఆర్థ‌ర్ రోడ్డు జైలుకు బ‌య‌లుదేరారు.

ఇదిలా ఉండ‌గా న‌టి జుహిచావ్లా ఆర్య‌న్ ఖాన్ బెయిల్ కోసం ల‌క్ష‌రూపాయ‌ల వ్య‌క్తిగ‌త పూచీక‌త్తును స‌మ‌ర్పించారు. ఇక క్రూయిజ్ నౌక‌లో డ్ర‌గ్స్ తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ ఆర్య‌న్ ఖాన్ దాదాపు నెల రోజుల పాటు ముంబై లోని ఆర్థ‌ర్ రోడ్డు జైలులో శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. ముద్దుల కొడుకు జైలులో ఉండ‌టంతో ఆర్య‌న్ ఖాన్ త‌ల్లి మ‌రియు షారుక్ ఖాన్ తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు. అంతే కాకుండా షారుక్ ఖాన్ ఉద‌యం త‌న కొడుకు విడుద‌ల అవుతాడ‌ని నిన్న రాత్రంతా కంటిపై క‌నుకు వేయ‌లేద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version