Breaking : రిషి సునాక్‌ ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేసిన శశిథరూర్‌

-

బ్రిటన్ నూతన ప్రధానిగా భారత సంతతి రిషి సునాక్ ఎన్నికవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సంతతి హిందువు రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం భారత్ కు ఓ పాఠం వంటిదని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. భారత్ లో హిందువు, సిక్కు, బౌద్ధ, జైన మతస్తులు కాకుండా, ఇతరులు ప్రధాని అవగలరా? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రోద్బలిత రాజకీయాలు బాగా నడుస్తున్న ప్రస్తుత కాలంలో ఇలాంటిది ఊహించగలమా? అని శశి థరూర్ అన్నారు. భారత ఉపఖండంలో జనించిన అన్ని మతాలను హిందుత్వ భావజాలం సమానంగానే చూస్తుంది. కానీ హిందుత్వవాదులే ఇతరులను సమానంగా చూడలేకపోతున్నారు అని శశి థరూర్ విమర్శించారు.

గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ అటవిక ప్రజలు, అటవిక మతం అని హిందువులు, హిందూ మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడా దేశానికి హిందుత్వవాది రిషి సునాక్ ప్రధాని అయ్యాడు. అదే రీతిలో ఓ క్రైస్తవుడు లేక ఓ ముస్లింను బీజేపీ భారత ప్రధాని పీఠంపై కూర్చోబెడుతుందని మనం ఊహించగలమా? అని శశి థరూర్ ప్రశ్నించారు. ఇటలీ దేశస్తురాలిగా, క్రిస్టియన్ గా ముద్రపడిన సోనియా ప్రధాని అయితే శిరోముండనం చేయించుకుంటానని ఓ ప్రముఖ రాజకీయనేత వ్యాఖ్యానించారంటూ సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు శశి థరూర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version