Sherlyn Chopra: షారుక్ పార్టీలో.. వాళ్లూ డ్ర‌గ్స్ తీసుకున్నారు.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్!

-

Sherlyn Chopra: సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వివాదం క‌ల‌క‌లం రేపుతుంది. నిన్న‌టి వ‌ర‌కూ టాలీవుడ్ ను కుదిపేసినా .. ఈ కేసు ఇప్పుడు.. బాలీవుడ్ ప‌ట్టుకుంది. ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దొరికిపోయిన‌ విష‌యం తెలిసింది. ఈ వ్య‌వ‌హ‌రంతో మరోసారి డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆర్యన్ ఖాన్ అరెస్ట్‏తో బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక‌సారిగా ఊలిక్కి పడింది.

ఈ విషయమై చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు బాద్‌షాకు సపోర్టుగా నిలుస్తుండ‌గా.. మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా డ్రగ్స్‌ గురించి మాట్లాడిన పాత వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ ప్ర‌ముఖులు పార్టీల్లో విచ్చలవిడిగా డ్ర‌గ్స్ వాడుతార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఆ వీడియోలో.. బాలీవుడ్ బాదుషా షారుక్‌ ఖాన్‌ ఇచ్చిన పార్టీ గురించి చెప్పింది. మాట్లాడుతూ..‘ ఆ పార్టీలో డ్యాన్స్ చేసి అలసిపోయిన నేను వాష్‌రూమ్‌కు వెళ్లాను. అక్కడి జ‌రుగుతుంది చూసి .. మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక నిమిషం తర్వాత .. అస‌లు విషయం అర్థమైంది. వాళ్లు తీసుకుంటుంది డ్ర‌గ్స్ అని.. అక్కడ ఉన్న‌వారంద‌రూ.. బాలీవుడ్ స్టార్ల భార్యలు. వాళ్లు అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీల్చుకోవ‌డం చూశాను. వారిని చూసి నవ్వి బయటకు వచ్చేశాను. తర్వాత షారుక్‌కి, అతడి స్నేహితులకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయా. అప్పుడే అర్థ‌మైంది .. బాలీవుడ్‌లో జరిగే పార్టీలిలా ఉంటాయా.. ’ అని షెర్లిన్ చోప్రా వీడియో చెప్పుకోచ్చింది. ఇప్పుడి ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version