హుజూరాబాద్ పోల్: నామినేషన్లలో ట్విస్ట్‌లు…అన్ని కష్టమే?

-

హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ఉత్కంఠత పెరిగిపోతుంది. హుజూరాబాద్ బరిలో ఎవరు గెలుస్తారని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తారా? లేదా టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి గెలుస్తారా? అనే విషయాలపై పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే హుజూరాబాద్‌లో ఈటల-టి‌ఆర్‌ఎస్‌ల మధ్యే ప్రధాన పోటీ జరగనుంది. కాంగ్రెస్‌తో సహ ఇతర అభ్యర్ధులు ఇక్కడ పోటీ ఇవ్వలేరని తెలిసిపోతుంది.

Huzurabad | హుజురాబాద్

అయితే హుజూరాబాద్‌లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ నడుస్తోంది. టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసేశారు. బి‌జే‌పి తరుపున ఈటలకు డమ్మీగా ఆయన భార్య జమున సైతం నామినేషన్ వేశారు. ఈటల నామినేషన్ వేయాల్సిన అవసరముంది. అటు కాంగ్రెస్ అభ్యర్ధి వెంకట్ కూడా నామినేషన్ వేయాల్సి ఉంది.

అయితే టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున నామినేషన్స్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాకపోతే అనుకున్న మేర నామినేషన్స్ పడేలా లేవు. ఎందుకంటే కోవిడ్ నింబంధనలు, వ్యాక్సిన్ సర్టిఫికేట్ నిబంధనలతో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లని నామినేషన్స్ వేయనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

దీనికి తోడు నామినేషన్ వేసే ప్రతి అభ్యర్ధి కనీసం రూ. 10 వేల డిపాజిటి…అభ్యర్ధికి మద్ధతిస్తూ స్థానికంగా ఉండే పదిమంది సంతకాలు చేయాలి. ఈ నిబంధనలతో హుజూరాబాద్‌లో ఎక్కువ నామినేషన్స్ పడేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, నిరుద్యోగులని నామినేషన్స్ వేయనివ్వకుండా ఎలాగోలా అడ్డుకోవాలని టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలని బట్టి చూస్తే పెద్ద సంఖ్యలో అయితే నామినేషన్స్ పడే ఛాన్స్ లేదు. అయితే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల….నిరుద్యోగుల చేత ఎలాగైనా నామినేషన్స్ వేయించాలని చూస్తున్నారు. వారికి సపోర్ట్‌గా ఉండాలని అనుకుంటున్నారు. మరి నామినేషన్స్ చివరి రోజు వరకు హుజూరాబాద్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వచ్చేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version