విడాకుల తరవాత మొదటి సారి హైదరాబాద్ కు సమంత…షూటింగ్ గ్యాప్ లో ఏడుస్తూ..!

-

అక్కినేని హీరో నాగ చైతన్య తో విడాకుల అనంతరం సమంత మొదటి సారిగా హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా సమంత ఓ యాడ్ షూట్ లో పాల్గొంది. హైదరాబాదులోని మకరంజా జూనియర్ కాలేజీలో ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అయితే షూటింగ్ గ్యాప్ లో సమంత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మనసులో ఎంతో బాధ ఉన్నా కెమెరా ముందుకు రాగానే డైరెక్టర్ చెప్పినట్లుగా సమంత నటించారని యూనిట్ సభ్యులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే సమంత కు హైదరాబాద్ తో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత చైతూ తో వివాహానికి ముందే హైదరాబాదులో ఉన్నారు. ఇక వివాహం జరిగిన తర్వాత హైదరాబాద్ నే స్థిరపడ్డారు. ఇటీవల సోషల్ మీడియా లైవ్ లో కూడా తాను ముంబై లో ఉండను అని మళ్లీ హైదరాబాద్ లోనే వచ్చి స్థిరపడతాను అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version