రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మంగళవారం నాడు జరిగిన మ్యాచ్ లో అంబటి రాయుడు పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్ క్రికెట్ అభిమానుల మతి పోగొట్టింది.36 ఏళ్ళ వయస్సులో అంబటి రాయుడు చేసిన డైవింగ్ క్యాచ్ చూసేవారికి కళ్ళు నమ్మలేని విధంగాా ఉంది.అసాధారణం, అద్భుతం అనేలా ఆ బాల్ ను పట్టుకుని పట్టుకునిఅభిమానులతో శభాష్ రాయుడు నీకు ఎవరు సాటి లేరు- రారు అనిపించుకున్నాడు.ఈ సీజన్లో చెన్నయ్ కి తొలి విజయం రాయల్ ఛాలెంజర్స్ పై లభించింది.
23 పరుగుల తేడాతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.బెంగళూరు బ్యాటింగ్ చేస్తుండగా 16వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేశాడు.ఆ బాల్ వాస్తవానికి వికెట్ల ముందే ఆగిపోవాలి, కానీ ఆకాష్ దీప్ బ్యాట్తోకానీ ఆకాష్ దీప్ బ్యాట్ తో బంతిని బౌండరీకి పంపే ప్రయత్నం చేశాడు.బంతి గాలిలోకి లేచింది.నిజానికి బంతి వెళుతున్న దిశలో అంబటి రాయుడు లేడు.పక్కన కొద్ది దూరంలో ఉన్నాడు.కానీ ఒక్క ఉదుటున చేపపిల్లలా ముందుకి దూకేసి కుడిచేతి వేళ్ళతో ఆ బంతిని పట్టుకొని కింద పడిపోయాడు.ఐనా బంతి వీళ్ళలోనే బందీ అయింది.అసాధ్యం లాంటి క్యాచ్ ను రాయుడు సాధ్యం చేసి చూపించాడు.
One handed stunner from Rayudu 🔥#RCBvsCSK #IPL2022 #CSK #AmbatiRayudu pic.twitter.com/5yth0BcfWp
— cricket_meme_haul (@cric_meme_haul) April 12, 2022