బెంగుళూరు లో జరుగుతున్న చెన్నై మరియు బెంగుళూరు మధ్యన ఐపీఎల్ మ్యాచ్ లో ఒక భారీ సిక్సర్ నమోదు అయింది. డుప్లెసిస్ టాస్ గెలవగానే ఎంత తప్పు చేశాడో చెన్నై ఇన్నింగ్స్ ను చూస్తే అర్ధమవుతుంది. చెన్నై జోరు చూస్తుంటే ఖచ్చితంగా 220 కు పైగానే పరుగులు చేస్తుందని క్లియర్ గా తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో చెన్నై తరపున శివమ్ ధూభే ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో హర్షల్ పటేల్ వేసిన బంతిని లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఈ బంతి 111 మీటర్ల కు వెళ్ళింది, ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు నమోదు అయిన సిక్సర్ లలో ఇదే హైయెస్ట్ కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్ లో శివమ్ దుబే కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు చేశారు.
వామ్మో… గేల్ కన్నా డేంజర్ ప్లేయర్… 111 మీటర్ల భారీ సిక్స్
-