గూగుల్‌కు దూరమవుతున్న శాంసంగ్‌, యాపిల్‌ వంటి కంపెనీలు….

-

శాంసంగ్‌, యాపిల్‌ వంటి కంపెనీలు గూగుల్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ ఏఐని తమ స్మార్ట్‌ఫోన్లలో ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)లో గూగుల్‌ వెనుకపడిపోడమే కారణంగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో శాంసంగ్‌ గెలాక్సీ మొబైల్స్‌ ఫోన్లలో గూగుల్‌ కు బదులుగా బింగ్‌ 90 డిఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ను డిఫాల్డ్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని శాంసంగ్‌ కంపెనీ గూగుల్‌కు సమాచారం ఇచ్చింది. ఏఐ ఆధారిత సెర్చ్‌ ఇంజిన్‌ చాట్‌బాట్‌ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి గూగుల్‌.. మైక్రోసాఫ్ట్‌ మధ్య యుద్ధం సాగుతున్నాయి. ఈ క్రమంలో గూగుల్‌ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు ఏఐ ఆధారిత సెర్చ్‌ ఇంజిన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. శాంసంగ్‌ డిఫాల్డ్‌ బ్రౌజర్‌గా గూగుల్‌ను తొలగిస్తే కంపెనీకి భారీ నష్టాలు కలిగే అవకాశం ఉంది. శాంసంగ్‌ ఫోన్లలో డిఫాల్డ్‌గా గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఇవ్వడం ద్వారా గూగుల్‌ ఏటా దాదాపు మూడు బిలియన్లు (భారత కరెన్సీలో రూ.24,583కోట్లు) ఆర్జించింది.

శాంసంగ్‌కు తోడు యాపిల్‌ సైతం డిఫాల్ట్‌ గూగుల్‌కు బదులుగా బింగ్‌ను మార్చితే.. గూగుల్‌ ఏటా సుమారు 20 బిలియన్ల నష్టం వచ్చే అవకాశాలున్నాయి. రెండు కంపెనీలతో గూగుల్‌ ఆందోళనకు గురవుతున్నది. ఆయా కంపెనీలు వైదొలిగితే పెద్ద ఎత్తున నష్టం కలుగనున్నది. మరో విషయం ఏంటంటే.. ఈ రెండు కంపెనీలు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకొని.. కంపెనీకి భారీగా ఫీజులు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్‌ సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తున్నది. ‘మ్యాగీ’ పేరుతో గూగుల్‌ కొత్త ప్రాజెక్టుపై పని చేస్తోంది. సెర్చింగ్‌, ఫొటోలు తదితర అన్ని సేవల్లోనూ ఏఐని చేర్చాలని కంపెనీ యోచిస్తోంది. అదే సమయంలో కంపెనీ ‘గిఫి’ యాప్‌పై పని చేస్తోంది.ఇది చిత్రాలను క్రియేట్‌ చేయనున్నది. దాంతో పాటు కొత్త భాషను నేర్చుకునేందుకు యాప్‌తో పాటు ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేస్తున్న సమయంలో చాట్‌బాట్‌ను ప్రశ్నలు అడిగేందుకు సెర్చ్‌లాంగ్‌ పేరుతో క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ను సైతం తీసుకువచ్చింది. అయితే, శాంసంగ్‌ కంపెనీ గూగుల్‌ను వదిలి మైక్రోసాఫ్ట్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంటే.. గూగుల్‌కు 23 బిలియన్ల నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version