అందాల ఆరబోతతో శివాలెత్తిస్తున్న శివాత్మిక..

-

జీవిత రాజశేఖర్ డాటర్ అనే ట్యాగ్ లైన్‌తో దొరసానిలా ప్రేక్షకుల ముందుకొచ్చింది శివాత్మిక రాజశేఖర్. 2019లో దొరసాని సినిమాతో ఆమె సినీ ఆరంగేట్రం జరిగింది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ సీనియర్ హీరోయిన్ జీవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా అంచనాలు అందుకో లేకపోయినా శివాత్మిక మాత్రం హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. మొదటి సినిమా దొరసానితో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కిన ఆ తర్వాత హీరోయిన్ గా శివాత్మికకు మంచి ఆఫర్లు అయితే రావడం లేదు.

టాలీవుడ్ సీనియర్ హీరో, హీరోయిన్ల కుమార్తె కావడంతో ఆమె ఆరబోత ఇస్తుందో లేదో అన్న కారణంతో.. చాలామంది సినిమా మేకర్లు, దర్శకులు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారన్న గుసగుసలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

అందుకే రాజశేఖర్ కుమార్తెలను హీరోయిన్‌గా తీసుకునే విషయంలో చాలామంది ఇష్టపడటం లేదట. అయితే శివాత్మిక తాను స్టార్ హీరోయిన్లకు బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా మేకర్లకు సిగ్నల్స్ పంపుతుంది.

మరి శివాత్మిక అందాలు చూపించే విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే, ఆమెకు మంచి మంచి సినిమాల్లో ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version