శోభనం మరుసటి రోజే నవ వధువు దారుణం..భర్తతో పాటు !

-

శోభనం అయిన మరుసటి రోజే భర్తతో పాటు అత్త, మామలకు విషం ఇచ్చింది ఓ నవ వధువు. ఈ సంచలన సంఘటన రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… జైపూర్‌ లోరి కోట్‌ పుట్లీ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఉన్నంతలో వివాహ వేడుకను ఘనంగా జరిపించారు అతని కుటుంబ సభ్యులు. ఐతే నూతన జంట మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ కుటుంబంలోని వ్యక్తులంతా.. ఆస్పత్రిలో చేరారు.

బీడీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం.. వారు ఇటీవలే కోలుకున్నారు. ఆలస్యంగా బయటపడ్డ ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేశారు. ఫిబ్రవరి 22 వ తేదీన కొట్‌ పుట్లీలోని లక్ష్మి నారాయణ ఆలయంలో.. తన కుమారుడి వివాహం జరిగిందని.. వరుడి తండ్రి నందు పట్వా తెలిపారు.

పెళ్లయినప్పటీ.. నుంచి వధువు పూజా తమతో పాటే.. నివసిస్తోందని చెప్పారు. పెళ్లయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం రాత్రి పెళ్లి కూతురు పూజ అందరికీ భోజనం వండి పెట్టిందని.. ఆమె మాత్రం తినలేదని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పోలీసులకు చెప్పారు. దీంతో ఆ పెళ్లి కూతురిపై అనుమానం వచ్చి.. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనింతటికీ.. ఆమె కారణమని.. విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news