కోటక్ మహీంద్రా బ్యాంకుకు షాక్.. ఆర్బీఐ ఆంక్షలు

-

దేశీయ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ కు ఆర్‌బీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ రెగ్యులేటరీ చర్యలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడాన్ని నిలిపివేసింది. ఈ బ్యాంకు టెక్నికల్ ప్లాట్‌ఫామ్స్‌లో సూపర్వైజరీ సమస్యలు గుర్తించిన క్రమంలోనే ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. గత రెండేళ్లుగా బ్యాంకు ఐటీ సిస్టమ్స్‌ను క్షుణ్నంగా పరిశీలన చేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఈ ఆంక్షలు  బ్యాంకు కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపవని ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటికే బ్యాంకు సేవలు పొందుతున్న ఖాతాదారులు, క్రెడిట్ కార్డు కస్టమర్లకు యదావిధిగా బ్యాంకింగ్ సేవలు అందుతాయని స్పష్టం చేసింది. మరోవైపు  ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారానే కొత్త అకౌంట్ ఓపెనింగ్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ తరుణంలో ఆర్‌బీఐ ఆ ఛానళ్లపై ఆంక్షలు విధిచడం కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త కస్టమర్లను చేర్చుకోవడం పై తీవ్ర ప్రభావం చూపుతుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version