మాంసాహారులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్నటి వరకు తక్కువ ధర ఉన్న చికెన్ అమాంతం పెరిగింది. ఇవాళ ఆదివారం కావడంతో స్వల్పంగా చికెన్ ధరలను పెంచారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కిలో చికెన్ పై 20 రూపాయలు పెరిగినట్లు తెలుస్తోంది. గత ఆదివారం హైదరాబాద్ మహానగరంలో స్కిన్ లెస్ చికెన్ కిలో 200 రూపాయలు ఉండేది.

కానీ ఈ వారం వచ్చేసరికి 220 రూపాయలకు చికెన్ ధరలను పెంచారు. విజయవాడ అలాగే గుంటూరులో కూడా పది రూపాయల మేర చికెన్ ధరలు పెరిగి 210 కి చేరుకుంది. విశాఖపట్నంలో 190 రూపాయలు ఉండగా వరంగల్లో 200 రూపాయలు అలాగే నల్గొండలో 190 రూపాయలుగా చికెన్ ధరలు ఉన్నాయి. ఖమ్మంలో 200 రూపాయలకు కిలో చికెన్ పలుకుతోంది. ఓవరాల్ గా 220 రూపాయల వరకు చికెన్ ధరలు పెరిగాయి అన్నమాట.