హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా దంచి కొడుతోంది వర్షం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీలలోకి నీళ్లు కూడా వెళ్లాయి.

అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతం మొత్తం జలమయం అయింది. ఈ రోడ్డు పూర్తిగా చెరువును తలపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన జనాలు ఆందోళనకు గురి అవుతున్నారు. కేవలం వర్షం పడటం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.. ప్రస్తుతం ఆ వాటర్ ను పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
భారీ వర్షానికి చెరువును తలపిస్తున్న మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు pic.twitter.com/IkXBzOf2rM
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2025