సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల పాటు స్టేషన్లోని మొత్తం 6 ప్లాట్‌ఫామ్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 120 రైళ్లను చర్లపల్లి రైల్వే జంక్షన్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్ , లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించనున్నారు. ఇందులో 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించనున్న భారీ స్కై కాంకోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అందులోనే రిటైల్ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. ముందుగా ప్లాట్‌ఫామ్స్ 2–3, 4–5లలో దాదాపు 50 రోజుల పాటు పనులు కొనసాగనున్నాయి. ఆ వెంటనే 4 ప్లాట్‌ఫామ్స్‌ను పున: ప్రారంభించనున్నారు.