బీఆర్ఎస్ కి షాక్.. మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై..!

-

లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు అయితే తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ బిజెపి పార్టీ లో చేరుతున్నారు. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి పార్టీని విడిచిపెట్టి చేరారు మరో మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకి చెందిన కీలక నేత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పార్టీని విడిచి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన బీజెపి లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. నల్లగొండ ఎంపీ టికెట్ ని తెరా చిన్నపరెడ్డి ఆశించారు. కానీ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చెప్పడం రాజకీయ పరిణామాలు నేపథ్యంలో బీఆర్ఎస్ దూరంగా ఉండాలని తేరా చిన్నపరెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు అయితే వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news