జగన్ కు షాక్.. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బదిలీ..!

-

సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు తో పాటు తెలంగాణ వ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జిలను హైకోర్టు బదిలీ చేసింది.ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన జడ్జి గా సిహెచ్ రమేష్ బాబు నియమితులయ్యారు.ప్రస్తుతం ఆయన కామారెడ్డి 9వ అదనపు జిల్లా జడ్జిగా ఉన్నారు.సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బిఆర్ మధుసూదన్ రావు ..రాష్ట్ర వ్యాట్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ గా బదిలీ అయ్యారు.సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీతో ఏపీ సీఎం జగన్ కేసులపై ప్రభావం చూపనుంది.మూడేళ్లకు పైగా జగన్ కేసులను సిబిఐ కోర్టు జడ్జిగా మధుసూదనరావు విచారణణ చేపడుతున్నారు.

జగన్ కేసులన్నీ ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయి.ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి.సిబిఐ తన వాదనలను వినిపించాల్సి ఉంది.ఈ దశలో న్యాయమూర్తి బదిలీ కావడంతో డిశ్చార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటినుంచి చేయాల్సిందేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.గతంలోనూ జడ్జీలు బదిలీ అయినప్పుడల్లా డిశ్చార్జి పిటిషన్ల విచారణ ప్రక్రియ మొదటికి వస్తుంది.డిశ్చార్జి పిటిషన్లపై మళ్ళీ మొదటికి వస్తే జగన్ కేసు విచారణ ప్రక్రియ ఆలస్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version