తెలంగాణ బీజేపీలో రెండే రెండు వర్గాలు ఉన్నాయనే ప్రచారం మొదటి నుంచి సాగుతూనే ఉంది. అందులో ఒకటి బండి సంజయ్ వర్గం అయితే మరొకటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్గం అనే ప్రచారం ఉంది. అయితే వీరిద్దరికీ మొదటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇక బీజేపీలో ఎక్కువగా బండి సంజయ్‌కు ఫాలోయింగ్ ఉందనేది కాదనలేని సత్యం. కిషన్‌రెడ్డి బండి సంజయ్‌కంటే సీనియర్. ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక బండి సంజయ్ మొదటి సారి ఎంపీగా గెలిచారు. అయినా తన హవా మాత్రం తగ్గించకుండా దూసుకుపోతున్నారు.
ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బండి సంజయ్ ప్రకటన తర్వాత ఎక్కడ తన ఇమేజ్ తగ్గిపోతుందో అనే ఆలోచనతో కిషన్‌రెడ్డి కూడా రంగంలోకి దిగారు. తాను కూడా ఆశీర్వాద యాత్ర చేస్తున్నట్టు ప్రకటించేశారు. దీంతో బీజేపీలో వీరిద్దరి మధ్య మొదటి నుంచి వర్గ పోరు నడుస్తుందనే అనుమానాలకు ఈ వరుస ప్రకటనలు కాస్త మరింత బలం చేకూర్చాయనే చెప్పాలి.
ఇక ఊహాగానాలకు తెర దించుతూ రీసెంట్ గా బీజేపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ అయిన రాజాసింగ్, సీనియర్ నేత స్వామిగౌడ్, ఇతరత్రా పెద్ద నేతలందరూ కూడా బండి సంజయ్ పాదయాత్ర గురించి ఏర్పాట్లు ప్రారంభించేశారు. తమ మద్దతు బండి సంజయ్‌కు సంపూర్ణంగా ఉంటుందని కూడా ప్రకటించేశారు. ఇక బండి పాదయాత్ర సక్సెస్ ఫుల్‌గా జరగాలని కోరుతూ ఏకంగా ప్రత్యేక పూజలు కూడా చేయించేస్తున్నారు. దీంతో పాటే పాదయాత్రను ఎలా నిర్వహిస్తామనేది కూడా వివరాలు చెబుతున్నారు. దీంతో కిషన్‌రెడ్డిక షాక్ తగిలినట్టయింది. మరి ఆయన పాదయాత్రకు ఎవరు మద్దతు ఇస్తారో చూడలి.