షాకింగ్; 13 ఏళ్ళ బాలిక పొట్టలో అరకేజీ జుట్టు, షాంపూ ప్యాకెట్ లు…!

-

కోయంబత్తూర్ లో ఒక ఆస్పత్రి 13 ఏళ్ల అమ్మాయి పొట్టలో నుంచి ఖాళీ షాంపూ ప్యాకెట్లతో పాటుగా ప్లాస్టిక్ ముక్కలను, వాటితో పాటు అర కిలోకు పైగా మనుషుల వెంట్రుకలను తొలగించింది. 7 వ తరగతి చదువుతున్న బాలిక, గత కొన్ని నెలలుగా తరచూ కడుపు నొప్పితో బాధపడుతుందని, తల్లిదండ్రులు నగరంలోని ఇక్కడి ప్రైవేట్ వీజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ బాలికకు స్కానింగ్ తీసారు.

ఆ స్కానింగ్ లో ఆమె కడుపులో బంతి లాంటి పదార్ధం ఉందని గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా దాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో… ఆ కణాలను తొలగించడానికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం, సర్జన్ గోకుల్ కృపాశంకర్ మరియు బృందం శస్త్రచికిత్స నిర్వహించి, ఆమె కడుపు నుండి జుట్టు మరియు ఖాళీ షాంపూ ప్యాకెట్లను విజయవంతంగా తొలగించారని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది.

దగ్గరి బంధువు మరణం కారణంగా బాలిక మానసికంగా కలత చెంది, ఇది ఖాళీ ప్యాకెట్లు మరియు వెంట్రుకలు వంటి వస్తువులను తినడంతో అవి లోపల పేరుకుపోయాయని దాని కారణంగా, ఆమెకు తరచూ నొప్పి వస్తుందని ఆస్పత్రి వైద్యులు గోకుల్ ప్రసాద్ మీడియాకు వివరించారు. బాలిక ఇప్పుడు పూర్తిగా కోలుకుందని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఒక రకంగా ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version