సామాజిక మాధ్యామాల్లో ట్విట్టర్ లో ఎప్పుడు ఏదోక అందమైన వీడియో మనకు దర్శనం ఇస్తూనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో వింతలు మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని ఇవి మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో విన్యాసాలు మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాజకీయవేత్త పరిమల్ నాత్వానీ ఒక వీడియో పోస్ట్ చేసారు. వీడియోలో, ఉల్లాసభరితమైన మానసిక స్థితిలో ఉన్న ఒక ఏనుగు తన పనిలో బిజీగా ఉన్న ఫెన్సింగ్ పెయింటర్ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. చిన్న జంబో మనిషితో ఆడటానికి కంచెను దాటటానికి కూడా ప్రయత్నిస్తుంది. దాని ముఖం మీద స్పష్టమైన చిరునవ్వు చూడవచ్చు. మనోహరమైన వీడియో జనవరి 26 న ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
ఈ అందమైన వీడియోలో, ఒక యువ ఏనుగు ఆడుకుంటూ చిత్రకారుడి వద్దకు ఆప్యాయంగా చేరుతుంది. మనుషులు జంతువులకు ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి అనే విషయం ఈ వీడియో చెప్తుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు దిగులుగా ఉంటే ఈ వీడియో చూడమని సూచిస్తున్నారు పలువురు.
In this adorable video, a young #elephant affectionately reaches out to the fence painter who plays with the animal. The elephant's playfulness is a treat for the eyes! A great instance of human-animal coexistence. @WWFINDIA @moefcc @PrakashJavdekar @wti_org_india @natgeowild pic.twitter.com/uUaEFTdz8C
— Parimal Nathwani (@mpparimal) January 26, 2020