TSPSC పేపర్ లీక్.. వెలుగులోకి సంచలన విషయాలు

-

Tspsc పేపర్ లిక్ కేసులో సిట్ దూకుడు గా ముందుకు సాగుతుంది. మరికొద్దిసేపటిలో సిట్ కార్యాలయానికి 9 మంది నిందితులు రానున్నారు. విచారణలో పలు కీలక విషయాలు రాబట్టిన సిట్… రాజ శేఖర్, ప్రవీణ్ & రేణుకా ఆమె భర్త డాక్యాను సుదీర్ఘంగా విచారించింది. రాజ శేఖర్ ఇచ్చిన సమాచారం తో తన మిత్రుడు సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది సిట్.

సురేష్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం తో సురేష్ ను అదుపులోకి తీసుకున్న సిట్… గ్రూప్-1 ప్రిలిమ్స్ కమిషన్ లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు క్వాలిఫై అయినట్లు ఆధారాలు సేకరించింది. దీంతో ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు & ఏడు గురు రెగ్యులర్ ఉద్యోగులకు సిట్ నోటీసులు జారీ చేసింది. Tspsc కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పనిచేస్తున్న సూపర్డెంట్ శంకర్ లక్ష్మి విచారించి న సిట్ బృందం. శంకర్ లక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version