రైతులకు షాకింగ్ న్యూస్.. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం?

-

కాంగ్రెస్ సర్కార్ రైతులకు షాకింగ్ న్యూస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే రైతు భరోసా అందించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ సహా కీలక మంత్రులు సంక్రాంతి నుంచి రైతు భరోసా అందిస్తామని చెబుతున్నారు.గతంలో భూమి ఉన్న రైతులు అందరికీ కేసీఆర్ రైతు భరోసా ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాకు కటాఫ్ పెట్టనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేసింది. 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా లిమిట్ పెడతారని టాక్ వినిపిస్తోంది.

Compensation to Farmers for Crop Loss

ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులకు సైతం రైతుభరోసా ఇవ్వకూడదని కేబినెట్ సబ్ కమిటీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రైతు భరోసాపై కమిటీ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీ, కేబినెట్ భేటీలో చర్చించి రైతు భరోసా అమలుపై విధి విధానాలను రూపొందిస్తారని సమాచారం. కాగా, రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకూ సీజన్‌కు ఒకసారి ఎకరాకు రూ.7500 ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version