అక్క అఖిల ప్రియకు షాక్ ఇస్తూ.. వైసీపీలోకి భూమా మౌనిక..!

-

భూమా మౌనిక మంచు మనోజ్ ను వివాహం చేసుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాలలోకి రావాలి అనుకుంటే అందుకు పూర్తిగా తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కొత్త చర్చ ప్రారంభమయ్యింది. ఇప్పటికే భూమా మౌనిక సోదరి భూమా అఖిల ప్రియ రాజకీయాలలో కొనసాగుతున్నారు. టిడిపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వచ్చే ఎన్నికలలో ఆళ్లగడ్డ నుండి భూమా అఖిలప్రియ పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే భూమా మౌనిక కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో మనోజ్ కూడా మౌనిక రాజకీయాలపై మాట్లాడడం జరిగింది.

అయితే టీడీపీ నుంచి అక్కాచెల్లెళ్లకు ఇద్దరికి టికెట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారు. దాంతో ఇప్పటికే టీడీపీ లో అఖిల ప్రియ కొనసాగుతోంది.. కాబట్టి మౌనిక కి వైసీపీ నుంచి టికెట్ ఇస్తామని హామీ ఇస్తే ఫ్యాన్ పార్టీలో ఆమె చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మౌనిక మేనమామ ఎస్ వి మోహన్ రెడ్డి వైసీపీలోనే ఉన్నారు . అలాగే మంచు మనోజ్ తండ్రి మౌనిక మామ మంచి మోహన్ బాబు కూడా వైసీపీలోనే కొనసాగుతున్నారు

ఒకవేళ మౌనిక రెడ్డి రాజకీయంగా ఉత్సాహం చూపిస్తే కనుక చిత్తూరు జిల్లా చంద్రగిరి నుండీ టికెట్ ఇవ్వడానికి వైసీపీ హై కమాండ్ రెడీగా ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయన రెండుసార్లు గెలిచారు. మౌనిక రెడ్డి గనుక ఓకే అంటే ఆ టికెట్ ఆమెకి ఇచ్చి చెవిరెడ్డిని తిరుపతికి పంపిస్తారు అని అంటున్నారు. ఇక అప్పటికే కొనసాగుతున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా చేస్తారని సమాచారం. స్థానికంగా మంచు ఫ్యామిలీకి చిత్తూరులో మంచి గుర్తింపు ఉండడంతో ఆమెను చంద్రగిరి నుంచి పోటీ చేయించి అవకాశాలు ఉండొచ్చు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version