ఆరు సంవత్సరాలుగా ‘గామి’ షూటింగ్: డైరెక్టర్ విద్యాధర్‌

-

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గామి.ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. అభినయ ,సమద్‌ మరియు హారిక ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే ‘గామి’ మూవీ గురించి డైరెక్టర్ విద్యాధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మేము 2018లో కేవలం రూ.25 లక్షల బడ్జెట్తో ఈ మూవీ తీసేందుకు సిద్ధమయ్యాం. దాదాపు 6 ఏళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది. గత ఐదేళ్లుగా విశ్వక్ షూట్ పెండింగ్లో ఉంది. మూవీ ఓపెనింగ్ సీను 2018లో ప్లాన్ చేస్తే 2023 నవంబర్లో తీశాం’ అని తెలిపారు. ఈ చిత్రం కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని విశ్వక్ తెలిపారు.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.గత ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన గామి చిత్రం వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version