మేడిగడ్డ ప్రాజెక్టు పియర్లు దెబ్బతిన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని ఆయన అన్నారు. మధ్య మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశామని నేతలతో సమావేశంలో చెప్పారు. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ‘ఒక్క పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప మొత్తం పళ్లు పీకి వేసుకోం’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎల్‌ఆర్ఎస్‌పైన కూడా కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌ఆర్ఎస్ విషయంలో గతంలో బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ విమర్శించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని మాట ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఎల్‌ఆర్ఎస్‌కు ఫీజు వసూల్ చేస్తోందని ఆరోపించారు .గతంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.