ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి షూటింగ్ అప్ డేట్

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమా షూటింగ్ ల వేగం పెంచారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న భీమ్లా నాయ‌క్ షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ సినిమా ను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా థీయేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. దీంతో ఆయ‌న త‌ర్వాతి చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమా కు స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. కాగ ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ అప్ డేట్ ను క్రిష్ జాగ‌ర్ల‌మూడి ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స్క్రీప్ట్ పై చర్చ‌లు జ‌రుపుతున్న ఫోటో ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. అంతే కాకుండా స్క్రీప్ట్ రీడింగ్ సెష‌న్ అద్బ‌తం గా ఉందని కామెంట్ ను కూడా జ‌త చేశాడు. అలాగే న్యూయ‌ర్ త‌ర్వాత హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌క‌టించాడు. కాగ ఈ సినిమా షూటింగ్ ను త్వ‌ర‌గా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version