బిజినెస్ ఐడియా: పుదీనా సాగుతో యాభై వేలకి పైగా సంపాదించచ్చు..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నార…? ఆ వ్యాపారంతో మంచిగా లాభాలను సంపాదించాలనుకుంటున్నారా…? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా మంచిగా లాభాలు పొందొచ్చు. అదే పుదీనా సాగు. పుదీనా సాగు తో ప్రతి నెలా 50 వేలకు పైగా డబ్బులు వస్తాయి. ఒక్కసారి పెట్టుబడితో 5 నుండి 6 ఏళ్ళ పాటు దిగుబడి సాధిస్తారు అయితే ఈ సాగు చేయడానికి 5 గంటల భూమి విస్తీర్ణం తీసుకుంటే సరిపోతుంది.

దుక్కి బాగా కలియదున్నాలి. ఎరువు వేసి 15 రోజుల పాటు నానబెట్టాలి. దీనికి అదనంగా డీఏపీ దుక్కిలో చల్లాలి. తర్వాత పుదీనా కాండలను కత్తిరించి నాటాలి. ఆరు నుండి ఏడు రోజులకి కండలు బాగా చిగురిస్తాయి. 30 రోజుల వ్యవధిలోనే దిగుబడి ప్రారంభమవుతుంది. ఇలా ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. ఇలా మీరు సాగునీ జాగ్రత్తగా చెయ్యాలి పురుగులు పట్టకుండా చూసుకోవాలి.

వేసవిలో పుదీనా కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు నుండి దీనిని కోస్తూ ఉంటే మరో వైపు నుండి చేను పెరుగుతూ ఉంటుంది ఇక ఖర్చుల విషయానికి వస్తే దుక్కి దున్నడానికి పశువులు ఖర్చు, ఎరువుల ఖర్చు, క్రిమిసంహారక మందుల ఖర్చులు ఇటువంటివి అన్ని ఉంటాయి ఎలా చూసుకున్నా సరే ఎనభై వేల వరకూ ఆదాయం వస్తుంది కాబట్టి ఈ సాగుని మొదలు పెట్టి మంచిగా లాభాలను పొందవచ్చు. ప్రతీ నెలా అదిరే లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version