రాష్ట్రంలో అన్నదాతలు పండించిన పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే, రైతుల సమస్యలను గాలికి వదిలేసి సీఎం రేవంత్ అండ్ అధికార యంత్రాంగం మిస్ వరల్డ్ పోటీలపైనే పూర్తి ధ్యాస పెట్టారని విమర్శలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అవస్థలు పడుతుండగా.. నిద్ర మత్తులో పౌర సరఫరాల శాఖ ఉందని అంటున్నారు.
అయితే, నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ మండలంలోని రేవోజీపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.ఎట్టకేలకు గన్నీ బ్యాగులను అధికారులు తెప్పించడంతో అందరికి సరిపోతాయో లేదోనని లారీపైకి ఎక్కి మరీ ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.