పాకిస్తాన్‌కు ఊహించని భారీ షాక్ తగిలింది. ఓ వైపు తన శక్తికి మించిన పనులను పాక్ చేయడం, భారత్‌ను యుద్ధానికి ఆహ్వానించే ధైర్యం చేయడాన్ని పాక్ పౌరులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఓవైపు దేశం అడుక్కుతినే పరిస్థితుల్లో ఉంటే ఎంతో శక్తిమంతమైన భారత్ తో యుద్దానికి కాలు దువ్వడం ఏంటని నిలదీస్తున్నారు.
తమకు యుద్ధం ఇష్టం లేదని.. ఇప్పటికే పాకిస్తాన్ చాలా నష్టపోయిందని.. ఆర్థికంగా కుదేల్ అయ్యిందని అంటున్నారు. పాక్ లో తినడానికి తిండి కూడా దొరకడం లేదని.. ధరలు అగ్గిలా కురుస్తున్నాయని.. ఇలాంటి టైంలో దేశాన్ని ఎలా బాగుచేయాలా? అని దేశాధినేతలు ఆలోచించకుండా భారత్‌ను రెచ్చగొట్టడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా, నిన్న రాత్రి భారత్ పాక్ దాడులను డిఫెండ్ చేస్తూ జరిపిన దాడుల్లో లాహోర్, సియాల్ కోట్, పెషావర్, కరాచీకి పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్లు సమాచారం.