బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లవ్ బ్రేకప్..!

-

చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు అలాగే.. విడిపోవడం చాలా కామన్‌ అయి పోయాయి. ఇప్పటికే చాలా మంది స్టార్లు తమ వివాహ బంధానికి, అలాగే.. ప్రేమ బంధానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేశారు. అమిర్‌ ఖాన్‌, నోయిల్‌, సమంత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది విడిపోయారు. అలాగే… లవ్‌ లో ఉన్న స్టార్లు కూడా బ్రేకప్‌ చెప్పుకుని.. ఎవరి దారులు వారు చూసుకుంటున్నారు.

ఇక కోవలో ప్రభాస్‌ భామ, బాలీవుడ్‌ స్టార్‌ శ్రధ్ధా కపూర్‌ కూడా చేరి పోయింది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తన చిరకాల ప్రియుడు, ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ కు బ్రేకప్‌ చెప్పినట్లు సమాచారం అందుతోంది. గత 7 సంవత్సరాలుగా వీరిద్దరూ.. ప్రేమించుకుంటున్నారు.అంతేకాదు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి.

ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ..వారు ఇద్దరు విడిపోతున్నట్లు ఓ వార్త హాల్‌ చల్‌ చేస్తోంది. ఇటీవల గోవాలో జరిగిన శ్రద్ధా పుట్టినరోజు వేడుకల్లో రోహన్ పాల్గొనలేదు. వీరిద్దరూ కొంతకాలంగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలిసింది. దీంతో నిజంగానే వారు విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version