తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. నవోదయ విద్యాలయాలపై లోక్ సభ, రాజ్య సభలో ఇచ్చిన నోటిీసులను తిరస్కరించినందుకు సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. దేశం మొత్తం 80 నవోదయ విద్యాలయాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నవోదయ విద్యాలయాన్ని కేటాయించలేదని విమర్శించారు. పిల్లలు చదువుకునే నవోదయ విద్యాలయాను కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో లేఖలు రాశారని.. ప్రధాని మోదీని నేరుగా కలిసినా.. ప్రయోజనం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకింత కక్ష… ఎన్ని లేఖలు రాసినా స్పందనలేదు: నామా నాగేశ్వర్ రావు
-