టాలీవుడ్ లోకి ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా ద్వారా పరిచయమై తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారీ యాక్షన్స్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె రొమాంటిక్ కామెడీ చిత్రాలతో కూడా అలరించింది. ఇదిలా ఉండగా ఈమె డేటింగ్, ప్రేమాయణం లాంటి విషయాలలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ తో డేటింగ్ చేసింది అంటూ వార్తలు బాగా ప్రచారం అయ్యాయి ఆ తర్వాత ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో కూడా ఈమె డేటింగ్ చేస్తోందన్న వార్తలు వినిపించాయి. అయితే ఇంతలోనే ఈ జంట కొన్ని కారణాల వల్ల విడిపోయారని వార్తలు రావడం గమనార్హం.
ఇక ఇప్పుడు మరో కొత్త బాయ్ ఫ్రెండ్ గురించి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ముంబైలో తన ప్రేమకు రాహుల్ మోడీతో కలిసి కనిపించింది. వీరిద్దరూ కలిసి డిన్నర్ డేట్ కూడా చేశారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇందులో శ్రద్దా, రాహుల్ మోడీ ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా కనిపించారు. ఇకపోతే ఈ రాహుల్ మోడీ ఎవరు? అనే విషయానికి వస్తే ఇతడు బాలీవుడ్ లో పాపులర్ రైటర్ కం అసిస్టెంట్ డైరెక్టర్.
శ్రద్ధా కపూర్ జనాధారణ పొందిన చిత్రం తూ ఝుటీ మై మక్కర్ అనే చిత్రానికి ఇతడు రచయితగా పనిచేశారు. లవ్ రంజన్ తో కలిసి రాహుల్ మోడీ సహారచయితగా ఈ చిత్రం కోసం పనిచేయడం జరిగింది. ఇలా పలు విజయవంతమైన చిత్రాలకు రాహుల్ మోడీ రచయితగా పనిచేశారు. ఏది ఏమైనా ఇలా మరో కొత్త బాయ్ ఫ్రెండ్ తో మరొకసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.