Shrashti Verma is out of Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. నేటికీ బిగ్ బాస్ షో ప్రారంభమై మొదటి వారం పూర్తయింది. మొదటివారం ముగిసే లోపు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఇక ఈరోజు ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ కావడంతో హౌస్ నుంచి శ్రష్టి వర్మ బయటకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొదటివారం శ్రష్టి వర్మ హౌస్ లో ఆకట్టుకోలేకపోయింది. ఆమె తోటి హౌస్ మేట్స్ తో సరిగ్గా కలవలేకపోయిందట.

శ్రష్టి వర్మ వారం రోజుల పాటు హౌస్ లో ఉన్నందుకు గాను రెండు లక్షల రెమ్యూనరేషన్ అందించనున్నారు. ఈరోజు రాత్రి లోపు ఈ విషయంపైన అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, బిగ్ బాస్ షోకి హోస్టింగ్ నాగార్జున చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో తొమ్మిదవ సీజన్లోకి అడుగుపెట్టింది. ఈ షో చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ రోజులలో ప్రతి ఒక్కరు నాగార్జున కోసం షోని ఎక్కువ మంది వీక్షిస్తారు.