అరంగేట్రం టెస్ట్ క్యాప్ ముద్దాడిన శ్రేయస్ అయ్యర్.. ఫొటో వైరల్

-

తన కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ క్యాప్‌ను అందజేశారు. ఆ క్యాప్‌ను అందుకున్న అయ్యర్ దానిని ముద్దాడుతున్న ఫొటో ప్రస్తుతం నెటింట్లో వైరల్ అయింది. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న అయ్యర్‌కు నెటిజన్ల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి.

గురువారం కాన్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ద్వారా అయ్యర్ టెస్టులో అరంగేట్రం చేశాడు. భారత జట్టు తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 303వ క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 54 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన శ్రేయస్ అయ్యర్ 4,592 పరుగులు చేశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 13 పరుగులు చేసి జేమిసన్ బౌలింగ్ క్యాచ్ అవుట్‌గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(40), ఛతేశ్వర్ పుజారాలు నిలకడగా ఆడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version