AP: రొయ్యల మేత ధర కిలోకు రూ.4 తగ్గింపు

-

ఆంధ్రప్రదేశ్ రైతులకు బిగ్ అలర్ట్. రొయ్యల మేత ధరను తగ్గిస్తూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని రొయ్యల రైతుల బాధలు… తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో రొయ్యల మేత ధర విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో రొయ్యల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

royyalu

ఈ తరుణంలోనే రొయ్యల మేత ధర కిలోకు నాలుగు రూపాయల చొప్పున తగ్గించింది చంద్రబాబు నాయుడు సర్కార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తయారీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆక్వా రైతుల సమస్యలపై ఇటీవల సమావేశమైన చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీలోని రొయ్యల రైతులకు ఊరట లభించనుంది.

  • రొయ్యల మేత ధర కిలోకు రూ.4 తగ్గింపు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తయారీ సంస్థల నిర్ణయం
  • ఆక్వా రైతుల సమస్యలపై ఇటీవల సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు

Read more RELATED
Recommended to you

Latest news