ఎద అందాలతో వల.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరోయిన్

-

యూనివర్సల్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రుతీ హాసన్. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెరంగేట్రం చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. గబ్బర్ సింగ్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ కొట్టిన శ్రుతీ.. ఆపై వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేసింది. స్టార్ హీరోల సరసన నటించి అనతి కాలంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది

మధ్యలో ప్రేమ వ్యవహారం వల్ల సినిమాలకు దూరం అయింది. అయితే ఈ మధ్యే ప్రియుడితో బ్రేకప్ చెప్పి.. తన లైఫ్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మళ్లీ సినీ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే శ్రుతీ తెలుగులో రవితేజ క్రాక్ చిత్రంలో చాన్స్ కొట్టేసింది. అయితే తాజాగా శ్రుతీ బాడీ షేప్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ రాగా.. హర్ట్ అయిన హీరోయిన్ ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది.

మనమెలా ఉన్నా.. మనల్ని మనం ప్రేమించుకోవాలి.. బక్కగా ఉన్నారు.. లావుగా ఉన్నారు.. అంటూ కామెంట్స్ చేయడం మానేయాలి అంటూ బోధించింది. అయితే శ్రుతీ తన ఫిజిక్ మళ్లీ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న శ్రుతీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎద అందాలతో వల వేసినట్టుగా ఉన్న ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version