శుక్రగ్రహ దోష నివారణకు ఇలా చేస్తే అన్ని శుభాలే !

-

శుక్రగ్రహం.. గ్రహాలలో ఇదొక ప్రత్యేకత కలిగినది. అయితే ఈ గ్రహం జాతక చక్రంలో లేదా మనరాశికి ఎన్నోస్థానంలో ఉందో దాన్ని బట్టి మంచిచెడు ఫలితాలను ఇస్తుంది. శుక్రలగ్నం 1 నుంచి 6వ స్థానం వరకు ఆధిపత్యం వహిస్తే శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. శుభానికి అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఆధిపత్యం వహిస్తే ఆ జాతకులు ఆయుష్మంతంగా జీవిస్తారు. ధైర్యవంతులుగా ఉంటారు. ఇతరులను తమ ఆధీనంలోకి తీసుకుని అధికారం చెలాయించే సామర్థ్యం గలవారుగా ఉంటారు. ఎటువంటి కార్యాన్నై‌నా పట్టుదలతో పూర్తి చేస్తారు.

 

శుక్రుడు రెండోస్థానంలో ఉంటే కుటుంబ బాధ్యతలను చేపడతారు. పెద్దలకు మర్యాద ఇవ్వటంలో, కుటుంబ సభ్యులతో ఆనందదాయకంగా గడుపుతారు. విద్యారంగంలో రాణిస్తారు. సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు. మూడో స్థానంలో శుక్రుడు ఆధిపత్యం వహిస్తే గట్టి పట్టుతో ఏ కార్యాన్నైనా సాధిస్తారు. కళలను ఆస్వాదించే వారుగా ఉంటారు. ప్రయాణాలలో ఆసక్తి చూపుతారు. భోజనప్రియులుగా ఉంటారు. 4వ స్థానంలో ఆధిపత్యం వహిస్తే పరిశోధనలో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. మంచి స్నేహితుల సహకారం అందుతుంది. 5వ స్థానంలో ఉంటే బుద్ధికుశలత కలిగి ఉంటారు. క్రీడలు వంటి వినోదాత్మక రంగాల్లో ఆసక్తి చూపుతారు. ఆరోస్థానంలో ఆధిపత్యం వహిస్తే జీవితంలో కష్టసుఖాలు సమపాళ్లలో లభిస్తాయి. యోగాలను లభించటం వంటివి జరుగుతాయి.

శుక్ర గ్రహ దోష నివారణ..

శుక్రగ్రహ నివారణ కోసం చేయాల్సిన కార్యక్రమాల్లో ప్రధానమైంది.. మేడి చెట్టు శుక్రుని వృక్షము. ప్రతి శుక్రవారం ఉదయం  పాత్రద్వారా నీటిని మేడి చెట్టుకు పోయాలి. అక్కడే దీపం వెలిగించాలి. దానిని పూజించి రావాలి. పదహారు వారాలు చేయాలి. ఈ దోషం ఉన్నవారు ‘తిరునావలీశ్వరాలయం’ క్షేత్రం సందర్శించాలి. శుక్రుడంతటి వాడికే శాప విమోచనం కలిగించిన క్షేత్రంగా విశ్వసించటంతో ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది. విల్లుపురం జిల్లాలోని తిరునావలూరులో నెలకొన్న ఈ ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాగే దుర్గాదేవి ఆరాధన, శివారాధన కూడా మంచి ఫలితాలనుఇస్తుంది. విష్ణు భక్తులు అయితే వేంకటేశ్వరస్వామి, పద్మావతిదేవిని ఆరాధించాలి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news