ఏపీలో కరోనా కేసుల సంఖ్య రొజురోజుకూ పెరిగిపోతుంది. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం అనేక చర్యలు చేపడుతుంది. కేసులు భారీగా పెరుగుతున్న నేపద్యంలో టెస్టుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే దేశంలోనే ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్న ఏపీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడానికి ఓ వినూత్నమైన పద్దతిని ఉపయోగించి బేష్ అనిపించుకుంటుంది.
రాష్ట్రం లోని ఐమాస్క్ బస్సుల ఉపయోగం లేకుండా పక్కనపెట్టి ఉన్నాయి. ఇక ఆ ఐమాస్క్ బస్సులను కరోనా టెస్టులు చేసేందుకు కేంద్రాలుగా మార్చేసింది. బస్సులను కూడా పరీక్షా కేంద్రాలుగా మార్చి ఉపయోగిస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందుతుంది. నేడు రాష్ట్రం లో 8 ప్రాంతాల్లో టెస్టులు నిర్వహించింది. మొబైల్ కోవిడ్ టెస్టింగ్ సెంటర్ అంటూ నెటిజన్లు ఆ ఫోటోలను తీసి తమ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన పద్దతిని ఉపయోగించినందుకు నెటిజన్లు ఏపీ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.