ఎయిట్ ప్యాక్స్ కోసం బన్నీ జాగింగ్…! ఫోటోలు ట్రెండింగ్…!

-

allu arjun captured while jogging his photos gone viral
allu arjun captured while jogging his photos gone viral

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దక్షిణ భారత దేశంలోనే ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన స్టైల్, మ్యానరిజం, కమిట్ మెంట్, సినిమా పై ఆయనకు ఉన్న ప్రేమే ఇందుకు కారణం. ప్రతీ సినిమాలో అభిమానులకు కొత్తగా కనిపించేందుకు ఆయన ఎంతగానో ప్రయత్నిస్తాడు అందుకుగాను ఎంతగానో కష్టపడతాడు. ప్రస్తుతం ఆయన థ్రిల్లింగ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా పుష్పా అనే పేరును పెట్టారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు అందుకుగాను ఆయన తగిన చర్యలు తీసుకుంటూ తన బాడీ లాంగ్వేజ్ ను తయారు చేసుకుంటున్నాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ పొడుగు జుట్టుతో, ఎయిట్ ప్యాక్స్ తో దర్శనం ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ ఎయిట్ ప్యాక్స్ కోసం జిమ్ లో తగిన కసరత్తులు తీసుకుంటూ వాకింగ్ జాగింగ్ లు చేస్తున్నాడు. ఈ నేపద్యంలో ఆయన తాజాగా ఏదో పార్క్ లో జాగింగ్ చేస్తూ కనిపించాడు అభిమానులు చూసి ఊరుకుంటారా బన్నీ కనపడగానే ఆయన ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పెట్టేశారు ఇప్పుడు ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ట్వీట్టర్ లో ఆయన ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో బన్నీ జాగ్ చేస్తూ పెద్ద జుట్టుతో కనిపిస్తున్నాడు దీంతో ఆయన అభిమానులు సుకుమార్ సినిమాలో బన్నీ లుక్ ఇదే అంటూ బన్నీ లుక్ అదిరింది అంటూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం బన్నీ లుక్ అదిరిపోయిందంటూ పుష్పా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే సినిమా స్మగ్లింగ్ బ్యాక్ గ్రౌండ్ తో బన్నీ స్మగ్లర్ గా కనిపిస్తాడు. సినిమాలోని కీలక పాత్రలో బన్నికి ప్రతినాయకుడిగా తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటించడం సినిమాకు మోరో హైలైట్. బన్నీ కి సరసన రష్మిక మందన్న నటిస్తుంది. ముఖ్య పాత్రల్లో జగపతి బాబు ప్రకాష్ రాజ్ లు కనిపిస్తారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news