ఇటీవల కాలంలో సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్న సిద్ శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈయన పాడిన పాటలు.. ఆ పాటల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఉండి పోరాదే.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. నీలి నీలి ఆకాశం.. సామజ వర గమన.. మగువ మగువ లోకానికి తెలుసా నీ విలువ వంటి పాటలు ఆయన స్థాయిని పెంచుతూ ప్రేక్షకులలో బాగా పాపులారిటీ సంపాదించు కోవడం గమనార్హం. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా తిరుగులేని అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రత్యేకంగా యూత్ లో అభిమానుల సంఖ్య పెంచుకున్నారు. ఆయన పాడిన పాటలు బాగా పాపులర్ కావడమే కాకుండా ఎక్కువ శాతం సినిమాలు ఆ పాటల వల్లే హిట్ అయ్యాయి అని చెప్పడంలో సందేహం లేదు.
1990 మే 19వ తేదీన జన్మించిన ఈయన సంగీత నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఇక చిన్న నాటి నుంచే పాటలంటే ఇష్టం ఉన్న కారణంగా ఆల్బమ్స్ తయారు చేసి వాటిని యూట్యూబ్లో పెట్టేవాడు. ఇక ఈ పాటలను చూసిన ఏ ఆర్ రెహమాన్ సిద్ శ్రీరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కడలి సినిమాలో తొలిసారి సిద్ శ్రీరామ్ కు అవకాశం ఇచ్చిన ఏ ఆర్ రెహమాన్.. ఆ తర్వాత విక్రమ్ నటించిన ఐ సినిమాలో కూడా అవకాశం ఇచ్చాడు ఇకపోతే అప్పటినుంచి శ్రీరామ్ కెరీర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు.
ఇంత పాపులారిటీని సంపాదించుకున్న సిద్ శ్రీరామ్ ఒక్క పాట కోసం ఎంత పారితోషకం తీసుకుంటాడు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన గాత్రంతో అద్భుతమైన స్వరాలను అందించిన సిద్ శ్రీరామ్ ఒక పాట కు రూ.6 లక్షల రూపాయలను తీసుకుంటున్నట్లు సమాచారం. సాధారణంగా సింగర్స్ పారితోషికాన్ని డిమాండ్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ సిద్ శ్రీరామ్ విషయంలో మాత్రం డిమాండ్ చేసే స్థాయికి ఆయన చేరుకున్నాడు అంటే నిజంగానే చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.