సిద్ధు- త్రిషల పెర్ఫామెన్స్‌ అదుర్స్​… వీడియో వైరల్

-

సుమారు 18 ఏళ్ల క్రితం యువ చిత్రంతో ఆకట్టుకున్న జోడీ సిద్ధార్థ్‌, త్రిష. అర్జున్‌గా సిద్ధు, అతని ప్రేయసి మీరాగా త్రిష ప్రేక్షకుల మెప్పుపొందారు. ఆ సినిమాలోని పార్టీ సాంగ్‌ ‘దేహం తిరి వెలుగన్నది చెలిమే’తో యువతను ఉర్రూతలూగించారు. అప్పుడెంత హుషారుగా డ్యాన్స్‌ చేశారో ఇప్పుడూ అదే ఉత్సాహం చూపించారు.

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు అయిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ఆడియో, ట్రైలర్‌ విడుదల వేడుకలో ఆ హంగామా కనిపించింది. ఈవెంట్‌లో భాగంగా మణిరత్నం సినిమాల్లోని పాటలను వేదికపై పలువురు గాయకులు ఆపించారు. అలా.. ‘యువ’లో తాము నర్తించిన గీతం ప్రారంభంకాగానే అతిథి సీట్లలో కూర్చొన్న త్రిష- సిద్ధార్థ్‌ సందడి చేశారు. ఆ హుషారైన పాటను వారూ పాడుతూ సీట్లోనే డ్యాన్స్‌ చేశారు. వేదికపై సాగే ప్రదర్శనే కాకుండా సిద్ధు- త్రిషల పెర్ఫామెన్స్‌కు అక్కడున్న అతిథులంతా ఫిదా అయ్యారు. ఈ దృశ్యాలను ఓ అభిమాని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ‘సూపర్‌ జోడీ’, ‘పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

‘యువ’ తర్వాత సిద్ధార్థ్‌, త్రిష కలిసి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనే చిత్రంలో నటించి, సూపర్‌ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘కళావతి’ అనే హారర్‌ కామెడీ సినిమాతో ఆకట్టుకున్నారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విషయానికొస్తే.. చోళ రాజ్య నేపథ్యంలో రూపొందిన భారీ బడ్జెట్‌ చిత్రంలో త్రిష, విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, శోభిత, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన చిత్ర బృందం చెన్నైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. చిత్ర బృందంతోపాటు సిద్ధార్థ్‌ హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version