పాక్ లో ఎన్నికల రోజు ఇంటర్నెట్ సేవలు ఎందుకు నిలిపివేశారని సింధ్ హైకోర్ట్ సీరియస్

-

పాకిస్థాన్ లో ఫిబ్రవరి 8న ఎన్నికల రోజున ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సింధ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ అంతరాయానికి గల కారణాలను వివరించాలని కోరింది.సింధ్ న్యాయస్థానం చీఫ్ జస్టిస్ అకిల్ అహ్మద్ అబ్బాసీ, పాకిస్తాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు, సోషల్ మీడియాను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్నెట్ సేవల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా దాఖలైన మూడు పిటిషన్లపై కోర్టు విచారణ చేసిన కోర్టు ప్రపంచం ముందు మిమ్మల్ని మీరు ఎందుకు అవహేళన చేసుకుంటారని మండిపడింది.

ఈ నేపథ్యంలో పాక్ టెలికమ్యూనికేషన్ అథారిటీపై పాకిస్థాన్ మంత్రులు, లాయర్లు జిబ్రాన్ నాసిర్, హైదర్ రజాతో పాటు పాకిస్తాన్ పబ్లిక్ ఇంటరెస్ట్ లా అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అబ్బాసీ మాట్లాడుతూ.. మీరు ఎన్నికలను నిర్వహించిన విధానం, వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరూ చూశారు.. ఎన్నికలు ఎలా జరిగాయో ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రపంచానికి వెల్లడిస్తుందని అని చీప్ జస్టిస్ అబ్బాసీ తెలిపారు.ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి,ఎవరు రాష్ట్రపతి, ఎవరు గవర్నర్ పదవిని పొందుతారు అని జస్టిస్ ప్రశ్నించారు. ఇక, విచారణను మార్చి 5కి వాయిదా వేస్తున్నాట్లు సింధ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version