సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా, పలు డిమాండ్లను కూడా నెరవేర్చాలని కార్మికులు సమ్మెకు వెళ్తున్నారు. మొత్తం 5 డిమాండ్లను కార్మికులు యాజమాన్యం ముందు ఉంచారు. వచ్చే నెల 9 తర్వాత సమ్మెకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం( టీబీజీకేెెెఎస్) నోటీసులు కూడా ఇచ్చింది.
మొత్తం నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్య గూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటికరించడాన్ని కార్మికులు వ్యతిరేఖిస్తున్నారు. దీంతో పాటు అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40కి పెంచాలని, కార్మికుల అలియాస్ పేర్లను మార్చాలని, ఏడాది నుంచి మెడికల్ బోర్డును నిర్వహించ లేదని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఏడాది కాలంగా మెడికల్ బోర్డు లేని కారణంగా డిపెండెంట్ల వయసు పెరిగిందని.. వారికి కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.