కొన్ని కొన్ని సార్లు మనుషులు అరుస్తూ ఉంటాము. ఇది చాలా సహజం. ఏదైనా కోపం వచ్చిన ఆనందం వచ్చినా కూడా అరవడం జరుగుతుంది. ఇలా అరవడాన్ని కేకలు, కేరింతలు వంటి పేర్లతో వర్ణిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకు ఏదైనా పెద్ద విజయం ఎదురైతే చాలా సంతోషం తో పెద్దగా అరుస్తూ ఉంటాము.
అదే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాము. అయితే అన్ని సార్లు భావవ్యక్తీకరణ కుదరకపోవచ్చు. ఒక్కసారి మనం బాధ కలిగినప్పుడు ఒకలాగ అరిస్తే.. ఆనందం కలిగినప్పుడు మరొకలా అరవడం జరుగుతూ ఉంటుంది.
అరుపులో కూడా పలు రకాలు ఉంటాయి. అయితే నిజంగా భావాన్ని చెప్పడానికి అరుస్తాము. భయం, కోపం, నొప్పి కలగడం ఇలా మనకి ఈ సందర్భాలు ఎదురైనపుడు అరుస్తూ ఉంటాము. ప్రమాదం జరిగినప్పుడు ఎదుటవాళ్ళని ఎలర్ట్ చేయడానికి లేదా మనం భయాన్ని తట్టుకోలేక అరుపునే ఆయుధాలుగా మార్చుకుంటాము. దీంతో అరుపుకి ప్రాధాన్యత వచ్చింది.
రీసెర్చ్ ప్రకారం చూస్తే మనం భయటం అరిచాము అంటే అవి రెండు విధాలుగా పని చేస్తాయి. ఒకటి మన ఫోకస్ ని అది పదునుగా చేస్తుంది. ఇంకొకటి అది ఇతరులని అలెర్ట్ గా చేస్తుంది. ఇలా అరుపు లేదా కేకలు రెండు వాటికి ఉపయోగపడతాయి.