సింగర్ మంగ్లి పెళ్లిపై క్లారిటీ… షాక్ స్టార్ సింగర్ !

-

గత కొన్ని రోజులుగా ప్రముఖ తెలంగాణ మరియు తెలుగు సింగర్ మంగ్లీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెళ్లి వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తను చూసిన తన అభిమానులు మరియు స్నేహితులు అంతా కూడా నిజమనే విధంగా ఈ వార్త చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా ఈ విషయం గురించి సింగర్ మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. ఈమె స్పందిస్తూ నేను ఈ వార్తను విన్న తర్వాత చాకులా షాక్ అయ్యాను.. అదేంటి నాకూడా తెలియకుండానే నాకు పెళ్లి చేస్తున్నారా అంటూ సెటైర్ వేసింది మంగ్లీ. అంతే కాకుండా తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఇక సింగర్ మంగ్లీ రానున్న రెండు నెలల కాలంలో పెళ్లి చేసుకోనుందని, పెళ్లి కొడుకు ఎవరో కాదు తన బావే అంటూ ఒక స్థాయిలో ప్రచారం జరిగింది.

ఇక తీరా ఈ రోజు మంగ్లీ ఇదంతా తూచ్ అంటూ అనడంతో అభిమానులు అంతా అవాక్కయ్యారు. అందుకే అస్సలు విషయం కరెక్ట్ గా తెలియకుండా సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇకనైనా కట్టిపెట్టండి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version