ఏందో కేసీఆర్ సార్ చేసే రాజకీయాలు ఎప్పుడు క్లారిటీ ఉండవు…ఆయన ఏ సమయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? ప్రత్యర్ధులకు ఎప్పుడు చెక్ పెట్టేస్తారో కూడా తెలియదు…కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు రావడం, ప్రత్యర్ధులు అలెర్ట్ అయ్యేలోపే వారికి చెక్ పెట్టేయడం చేస్తారు..అసలు తన వ్యూహాలపై ప్రత్యర్ధులకు ఏ మాత్రం క్లారిటీ లేకుండా చేసి సక్సెస్ అయిపోతారు.
ఇప్పుడు కూడా కేసీఆర్ అలాగే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది…ఆయన రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాకుండా ఉంది..అసలు తెలంగాణలో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే పార్టీ కాంగ్రెస్..కానీ కేసీఆర్ మాత్రం కమలం పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఎలాగో బీజేపీ ఎదుగుతుంది కాబట్టి ఆ పార్టీని టార్గెట్ చేసి, ప్రజల్లో హైలైట్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎక్కువ చీలిస్తే తమకు బెనిఫిట్ అవుతుందనే కోణంలో ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా రాష్ట్రంలో ఉన్న బీజేపీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసి కేసీఆర్ పనిచేస్తున్నారు. అసలు బీజేపీ వల్ల దేశం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పుకొస్తున్నారు. పనిలో పనిగా కాంగ్రెస్‌కు పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది…అసోం సీఎం, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలని ఖండించి కాంగ్రెస్ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ వచ్చేలా చేశారు. అంటే ఈ ప్లాన్‌తో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారా? అనే డౌట్ కూడా వస్తుంది.
అసలు తెలంగాణలో బతికిచెడ్డ కాంగ్రెస్‌కు ఇంకా ఓటు బ్యాంక్ ఉంది. అంటే బీజేపీ కంటే కాంగ్రెస్ బలమైన పార్టీ. అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతతో కాంగ్రెస్ పుంజుకోవద్దనేది కేసీఆర్ ప్లాన్. కాంగ్రెస్ తమ సమీపంలోకి రాకుండా ఉండాలంటే, బీజేపీ బలంగా మారాలనేది కేసీఆర్ స్ట్రాటజీ. అందుకే బీజేపీనే ఎటాక్ చేసి, కాంగ్రెస్‌ని సైడ్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు రాహుల్‌కు మద్ధతుగా మాట్లాడి…టీఆర్ఎస్-కాంగ్రెస్‌లు ఒక్కటే అని బీజేపీ ప్రచారం చేసుకునే పరిస్తితి కల్పించారు. దీని వల్ల ప్రజలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకం అంటే బీజేపీ వైపుకే వెళ్తారు తప్ప కాంగ్రెస్ వైపు వెళ్లారు. అంటే అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్-బీజేపీలు చీల్చుకుంటే అంతిమంగా టీఆర్ఎస్ లాభపడుతుంది.