రూ.60 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన సిరిసిల్ల ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

-

రాష్ట్రంలో మరో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.రూ.60 వేలు లంచం తీసుకుంటూ సిరిసిల్ల ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అర్రం రెడ్డి అమరేందర్ రెడ్డిని కరీంనగర్‌లోని తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు మరియు అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ పనికి సంబంధించిన రూ.50 లక్షల బిల్లును మంజూరు చేయడానికి రూ.60 వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా.. అధికారుల సలహా మేరకు బాధితుడు లంచం ఇస్తుండగా.. అమరేందర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news